13 ఏండ్లకే సొంత బ్రాండ్..లక్షల్లో సంపాదన

అనౌష్క పొద్దార్​. వయసు పదమూడేండ్లు. సొంతగా ‘శ్నాజ్’​ అనే బ్రాండ్​ని లాంచ్​​​ చేసింది. లక్షల్లో సంపాదిస్తోంది కూడా. ప్రస్తుతానికి ముంబైకే పరిమితమైన  శ్నాజ్​ ప్రొడక్ట్స్​ని,  త్వరలో  ఇండియా మొత్తం తీసుకురానుందట ఈ చిన్నారి. అసలు ఇంత చిన్న వయసులో సొంతంగా వ్యాపారమేంటి? అన్నదేగా  ప్రశ్న. దీనికి సమాధానం ‘నాకు ఎదురైన సమస్యే’ అని చెప్తోంది ఈ చిన్నారి. ఆ సమస్యకి సొల్యూషనే నా శ్నాజ్​ ప్రొడక్ట్స్​ అంటోంది.

సమస్య వచ్చిపోగానే హమ్మయ్య!  అని  రిలాక్స్​ అయిపోతారు మనలో చాలామంది. కానీ, కొందరు మాత్రం ఆ ప్రాబ్లంకే  పెద్ద తలనొప్పిగా మారతారు. దాన్ని పిండి పిప్పి చేసి డస్ట్​ బిన్​లో పడేస్తారు. ఆ సమస్య మరొకరి దరిదాపుల్లోకి రాకుండా కాపలా కాస్తారు. ఆ కోవకే వస్తుంది ఈ చిన్నారి​ కూడా. తనకి ఎదురైన స్కిన్​ సమస్యలు మరొకరికి వద్దని  ఏకంగా కంపెనీయే స్టార్ట్​ చేసింది. అసలు ఈ ఆలోచన వెనకున్న కథేంటని అడిగితే ఈ యంగ్​ ఎంట్రప్రెనూర్​ ఏం చెప్పిందంటే..

అలాంటి ప్రొడక్ట్​ ఒక్కటీ లేదు

‘‘పన్నెండు నుంచి ఇరవై నాలుగేండ్ల వయసున్న 80 శాతం అమ్మాయిలు యాక్నె, తామర, వైట్ హెడ్స్​ .. ఇలా రకరకాల స్కిన్​ ప్రాబ్లమ్స్​తో ఇబ్బంది పడుతున్నారు. వాళ్లలో నేనూ ఒకదాన్ని. అందరి అమ్మాయిల్లానే స్కిన్​ అలర్జీ వచ్చినప్పుడు చాలా భయపడ్డా. కానీ, అమ్మమ్మ, నానమ్మ  ‘పసుపు రాస్తే పోతుంది. ఉప్పు రాస్తే చాలు’ అంటూ వంటింటి చిట్కాలన్నీ చెప్పారు. అవి నా స్కిన్​పై ఎలాంటి రిజల్ట్​ చూపించలేదు. అమ్మ ఫేమస్​ బ్రాండ్​​ ప్రొడక్ట్స్​ అన్నీ ట్రై చేసింది. అయినా అలర్జీ తగ్గలేదు. నా ఫ్రెండ్స్​ని అడిగితే... ‘మా సమస్య కూడా ఇదేనం’టూ ఒక్కొక్కరూ ఒక్కోటి చెప్పారు. నా రీసెర్చ్​లో తేలింది ఏంటంటే... పిల్లలు, పెద్దల స్కిన్​ కోసం మార్కెట్​లో చాలా బ్రాండ్స్​ ఉన్నాయి. కానీ, టీనేజర్స్​ కోసం అందుబాటులో ఉన్న పర్సనల్​ కేర్​ ప్రొడక్ట్స్​ని​ వేళ్ల మీద లెక్కపెట్టొచ్చని. దాంతో ఈ సమస్యకి సొల్యూషన్​ నానుంచే మొదలవ్వాలి అనుకున్నా. 

వాళ్ల ఇన్​స్పిరేషన్​తో...

చిన్నప్పట్నించీ ఎలన్​ మస్క్​ , స్టీవ్​ జాబ్స్​, బిల్​గేట్స్​ నా​ ఇన్​స్పిరేషన్​. వాళ్లలా పెద్ద బిజినెస్​ నెట్​వర్క్స్​ని బిల్డ్​ చేయాలన్నదే నా కల. అందుకే నా సమస్యకి సొల్యూషన్​గా సొంతంగా నేనే ప్రొడక్ట్స్​ తయారు చేయాలనుకున్నా. టీనేజర్స్​ కోసం పర్సనల్​ కేర్​ సొల్యూషన్స్​ని తీసుకురావాలనుకున్నా. ఆ ఆలోచనతోనే ‘థాపర్ ఎంట్రప్రెనూర్​ అకాడమీ’లో చేరా. అక్కడ సేల్స్​, మార్కెటింగ్​ , ఫైనాన్షియల్​ మేనేజ్​మెంట్​, సప్లయ్​ చైన్​ లాంటి బేసిక్​ బిజినెస్​ స్కిల్స్​ నేర్చుకున్నా. నా టీచర్స్​, తెలిసినవాళ్లు, ఇండస్ట్రీ ఎక్స్​పర్ట్స్​ సజెషన్స్​ కూడా తీసుకున్నా. మార్కెట్​లో ఉన్న పాపులర్​ బ్రాండ్స్​ ఫార్ములాలని  స్టడీ​ చేశా. నా మీద నాకు నమ్మకం వచ్చాక నాన్నతో చెప్తే ఆయన క్షణం ఆలోచించకుండా చెక్​ చేతికిచ్చారు. ఇదంతా ఒకెత్తు అయితే నా ప్రొడక్ట్స్​కి కరెక్ట్​ ఫార్ములేషన్​ కత్తి మీద సాములా మారింది. ఈ విషయంలో ఒక ముంబై బేస్డ్​ మ్యాను ఫ్యాక్చరింగ్​​ కంపెనీ నాకు అండగా నిలిచింది. చాలా రకాల టెస్ట్​లు, ప్రొటో టైప్స్​, ట్రయల్స్​ తర్వాత ల్యాబ్​​ సైంటిస్ట్​లు పర్ఫెక్ట్​ ఫార్ములాతో ‘శ్నాజ్’​ షాంపూలు, కండిషనర్స్​ తయారుచేశారు. 

పాన్​ ఇండియా.. 

‘ బీ వాట్​ యు వాంట్​’ ట్యాగ్​ లైన్​తో శ్నాజ్​ నుంచి మొదట ‘యాపిల్​ అడిక్షన్’​ షాంపూ, ‘ఆర్గాన్​ అంబీర్’ అనే కండిషనర్​ని కిందటి ఏడాది లాంచ్​ చేశాం. సల్ఫేట్​, పాథాలెట్స్​, పారాబెన్స్​ లాంటి కెమికల్స్​ లేకుండా పూర్తిగా నేచురల్​ ఇంగ్రిడియెంట్స్​తో తయారుచేశాం వీటిని. ప్రస్తుతం శ్నాజ్​ వెబ్​సైట్, ఇన్​స్టాగ్రామ్​ ద్వారా మాత్రమే  సేల్​ చేస్తున్నా. అది కూడా కేవలం ముంబైలో. 
రానున్న నెలల్లో అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​​, నైకా లాంటి వెబ్​సైట్స్​ ద్వారా ఇండియా మొత్తం మా ప్రొడక్ట్స్​ని అందుబాటులోకి తీసుకురానున్నా. అలాగే స్కిన్​ ప్రొడక్ట్స్​ని ఇంట్రడ్యూస్​ చేయబోతున్నా.’’