చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న అనధికారిక టెస్టులో భారత అండర్ 19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన కనపరిచాడు. 58 బంతుల్లోనే 100 పరుగులు సాధించి భారత రెడ్-బాల్ క్రికెట్ రెకార్డుల్లోకెక్కాడు. అండర్ 19 క్రికెట్‌లో భారత్ తరుపున వేగవంతమైన సెంచరీ చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, U19 రెడ్-బాల్ క్రికెట్‌లో సెంచరీ నమోదు చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు.
ALSO READ | IND vs BAN 2nd Test: కుప్పకూలిన బంగ్లాదేశ్.. టీమిండియా టార్గెట్ 95
మొదటి రోజు ఆటలో 47 బంతుల్లో 81* పరుగులు చేసి భారత్‌ను ఆదుకున్న సూర్యవంశీ.. రెండో రోజు మరో 11 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. కేవలం రెండు బంతుల తేడాతో యూత్ టెస్టుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన మోయిన్ అలీ ఆల్-టైమ్ రికార్డును సరిదిద్దే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మధ్యనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన ఇంగ్లిష్ ఆల్‌రౌండర్ 2005లో శ్రీలంకపై కేవలం 56 బంతుల్లోనే U19 టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ చేసి రికార్డు నెలకొల్పాడు.
13 YEAR OLD VAIBHAV SURYAVANSHI AGAINST AUSTRALIA U19:
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2024
- 100 in just 58 balls for India U19 in the Youth Test match...!!! 🤯🇮🇳 pic.twitter.com/NbWW7SSz74
ఈ ఏడాది ప్రారంభంలో సూర్యవంశీ (అప్పుడు 12 ఏళ్లు) బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. రంజీ ట్రోఫీ 2023-24లో నాలుగు ఇన్నింగ్స్‌లలో 31 పరుగులు చేశాడు.
Vaibhav Suryavanshi becomes the YOUNGEST player to score Intl fifty at any level.
— Kausthub Gudipati (@kaustats) September 30, 2024
Youngest players with U19 INTL fifty
13y 187d - Vaibhav Suryavanshi🇮🇳 v AUS, Today
14y 231d - Najmul Shanto🇧🇩 v SL, 2013
14y 272d - Hasan Raza🇵🇰 v ENG, 1996#IndvAus pic.twitter.com/SSM45pvvNn