ఇండియన్స్‌ను తరలించేందుకు 130 రష్యా బస్సులు

ఇండియన్స్‌ను తరలించేందుకు 130 రష్యా బస్సులు

ఉక్రెయిన్ లోని ఖార్కివ్, సుమీ సిటీల్లో చిక్కుకున్న భారత విద్యార్థులను ఆ యుద్ధ భూమిని నుంచి బయటపడేసేందుకు రష్యా ముందుకొచ్చింది. తాము 130 బస్సులను ఏర్పాటు చేసి.. ఉక్రెయిన్ నుంచి సేఫ్ గా తరలిస్తామని రష్యన్ నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ హెడ్ కల్నల్ మిఖాయిల్ మిజినంట్సెవ్ చెప్పారు. ఉక్రెయిన్ లోని ఖార్కవ్, సుమీ ప్రాంతాల్లో ఉన్న భారతీయులతో పాటు ఇతర దేశాల విద్యార్థులను.. రష్యాలోని బెల్గోరోడ్ రీజియన్ కు చేరుస్తామని పేర్కొన్నారు. అక్కడి నుంచి విమానాల్లో వారి వారి సొంత దేశాలకు వెళ్లొచ్చన్నారు.

కాగా, ఇప్పటికే ‘ఆపరేషన్ గంగ’ పేరుతో భారత ప్రభుత్వం.. ఉక్రెయిన్ నుంచి భారతీయులను వేగంగా తరలిస్తోంది. ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా ఆ దేశం ఎయిర్ స్పేస్ ను మూసేయడంతో మన విద్యార్థులను సరిహద్దులకు చేరుకోవాలని సూచించింది. అలా బోర్డర్లకు చేరుకున్న వారిని పొరుగు దేశాల్లోని ఎయిర్ పోర్టుల ద్వారా ఇండియాకు తీసుకొస్తోంది. ఇప్పుడు రష్యా తమ దేశంలోకి మన పౌరులను తరలించేందుకు ముందుకు రావడంతో అక్కడి నుంచి కూడా వేగంగా మన దేశానికి తీసుకురానుంది.

మరిన్ని వార్తల కోసం..

ఆడవాళ్లు మెచ్చే సినిమా

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్

 

యూట్యూబ్​తో మనోళ్ల సంపాదన రూ. 6,800 కోట్లు