కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌కే డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. క్యాంపస్ సెలక్షన్‌కు 300 మంది విద్యార్థులు హాజరు కాగా ఇందులో 130 మంది ఎంపికయ్యారు.
త్వరలో వీరికి నియమాకపత్రాలు అందిస్తామని ప్రతినిధులు తెలిపారు. కాలేజీ సీఈవో జైపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ సైదయ్య, దత్తాద్రి, నవీన్, గోవర్ధన్, గంగాధర్, ఆయా కంపనీల ప్రతినిధులు పాల్గొన్నారు.