కార్పొరేట్ సంస్థల్లో చాలా మంది ఉద్యోగులు ఆడ,మగ కలిసి పోయి వర్క్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఈ వర్క్ కాస్త రిలేషన్ పిప్ గా మారి.. అది ప్రేమ వరకు దారితీస్తుంది. ఇంకేముంది ప్రేమించుకుంటున్నాం.. త్వరలో పెళ్లి చేసుకుంటాం అని శారీరకంగా దగ్గరయ్యారా.. ఇక అంతే మీగొయ్యు మీరు తవ్వుకున్నట్లే. అదనుచూసుకొని మిమ్మలను చూడకూడని రీతిలో చూడటమే కాకుండా.. నగ్నంగా ఫొటోలు తీసి సెల్ ఫోన్ లో తీసి గ్యాలరీలో సేవ్ చేసుకున్నాడు ఓ ప్రబుద్దుడు.. ఒకటి రెండు కాదు... ఏకంగా 13 వేల ఫొటోలు సెల్ఫోన్ లో భద్రపర్చుకున్నాడు. తీరా ఈ విషయం బయటకు వచ్చిన తరువాత ఆ కీచకుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.
బెంగళూరులో తాజాగా ఓ ఘోరం చోటు చేసుకుంది. నాలుగునెలలుగా తనతో పాటు రిలేషన్ షిప్ లో ఉన్న ప్రియుడు సంతోష్... ఆమెను వాడుకోవడమే కాకుండా తన నగ్న ఫొటోల్ని తీశాడు. ఇలా తనతో పాటు తన తోటి మహిళా ఉద్యోగుల ఫొటోలు కూడా తీసుకున్నాడు. ఇవన్నీ కలిసి 13 వేల ఫొటోల వరకూ ఉన్నాయి. వీటిని ప్రియుడి ఫోన్లో చూసిన ఆమెకు మైండ్ బ్లాక్ అయింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరులోని ఓ బీపీఓ సంస్ధలో పనిచేస్తున్న 22 ఏళ్ల యువతికి సంతోష్ అనే ఓ ప్రియుడు ఉన్నాడు. వీరిద్దరూ గత నాలుగు నెలలుగా కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో బాగా దగ్గరయ్యారు కూడా. ఆమె ఈ సమయంలో ప్రియుడితో చాలా సన్నిహితంగా మెలిగింది. అలా నాలుగు నెలలు రిలేషన్ షిప్ కొనసాగించిన తర్వాత ఓ రోజు ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. అనుకోకుండా ఓసారి ప్రియుడి సెల్ ఫోన్ తీసుకుని గ్యాలరీ తెరిచింది.
ప్రియుడి సెల్ ఫోన్ గ్యాలరీలో ఏకంగా 13 వేల నగ్న ఫొటోలు దర్శనమిచ్చాయి. ఇందులో తనతో పాటు తనతో పాటు అదే సంస్ధలో పనిచేస్తున్న ఇతర మహిళ ఉద్యోగుల నగ్న ఫొటోలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడగానే ఆమె అవాక్కయింది. తనతో పాటు కలిసి ఉంటూ ప్రియుడు ఈ ఫొటోలు తీసినట్లు గుర్తించింది. అంతే ఒళ్లు మండిపోయి అతనితో రిలేషన్ షిప్ ను తెగతెంపులు చేసేసుకుంది. అంతే కాదు ఆ మిగతా న్యూడ్ ఫొటోల్లో ఉన్న ఉద్యోగుల్ని కూడా అలర్ట్ చేసింది. చివరికి ఈ విషయం బీపీవో పెద్దలకు కూడా తెలిసింది. దీంతో వారు బెంగళూరు సైబర్ క్రైమ్ పీఎస్ లో కేసు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ సంతోష్పు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మీ ఫోటోలు తోటి మగ ఉద్యోగుల సెల్ మీ ఫొటోలు సేవ్ అవుతాయి. ముందు ఫ్రెండ్స్.. తరువాత లవర్స్.. తరువాత దంపతులు అవుదామనుకున్నారా.. మీ నగ్న ఫొటోలు బహిర్గతం అయ్యే అవకాశం ఉంది.మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
Also Read :-కేటీఆర్ చేసిన తప్పేంటీ.. ఈసీకి కాంగ్రెస్ కంప్లయింట్ కారణాలు ఏంటీ..?