జీహెచ్ఎంసీ ప్రజావాణికి 132 ఫిర్యాదులు

జీహెచ్ఎంసీ ప్రజావాణికి 132 ఫిర్యాదులు

హైదరాబాద్ సిటీ/ఇబ్రహీంపట్నం, వెలుగు: జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 132 ఫిర్యాదులు అందాయి. హెడ్డాఫీసులోని ప్రజావాణికి 38 ఫిర్యాదులు, ఫోన్ ఇన్ ప్రోగ్రామ్​కు 6 ఫిర్యాదులు వచ్చాయి. అడిషనల్ కమిషనర్లు శివ కుమార్ నాయుడు, నళిని పద్మావతి, గీతా రాధిక, పంకజ, రఘు ప్రసాద్, సుభద్ర దేవి, చంద్రకాంత్ రెడ్డి, యాదగిరి రావు, సీసీపీ శ్రీనివాస్, అడిషనల్ సీసీపీ ప్రదీప్ కుమార్, ఆయా విభాగాల అధికారులు పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు.

 కూకట్​పల్లి జోన్​లో అత్యధికంగా 65, ఎల్బీనగర్​జోన్​లో 10, సికింద్రాబాద్​జోన్​లో 8, శేరిలింగంపల్లి జోన్​లో 7, ఖైరతాబాద్, చార్మినార్​జోన్లలో రెండు చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. రంగారెడ్డి కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 65 ఫిర్యాదులు అందాయి. 

హైదరాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్​అనుదీప్​పాల్గొని ఫిర్యాదులు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 332 మంది అప్లికేషన్లు  అందజేశారు.