కామారెడ్డి, వెలుగు: కొత్తగా ఓటరు నమోదుతో పాటు, మార్పులు, చేర్పుల కోసం శని, ఆదివారాల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కు కామారెడ్డి జిల్లాలో మొత్తం 4,510 అప్లికేషన్లు వచ్చాయి. కొత్తగా ఓటరు కోసం 3,484, మార్పులు, చేర్పుల కోసం 1,026 అప్లికేషన్లు వచ్చాయి.
కామారెడ్డి నియోజకవర్గంలో కొత్త ఓటర్ల కోసం1,336, ఎల్లారెడ్డిలో 646, జుక్కల్‌లో 1,502 దరఖాస్తులు వచ్చాయి. భిక్కనూరులో జరిగిన స్పెషల్డ్రైవ్ను కలెక్టర్జితేశ్వి పాటిల్, జిల్లా కేంద్రంలో అడిషనల్కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.