నిజామాబాద్ జిల్లాలో  ఆరు నెలల్లో  134  కేసులు

నిజామాబాద్ జిల్లాలో  ఆరు నెలల్లో  134  కేసులు
  • డెంగ్యూ డేంజర్​ బెల్స్
  •  గ్రామాల్లో 90, పట్టణాలలో 44
  •  వైరల్​, డయేరియా, టైఫాయిడ్​ విజృంభణ
  •  ప్రైవేట్​ హాస్పిటల్స్​లో వందల కొద్ది పేషెంట్లు అడ్మిట్​ 
  •  ఇందూర్​ మెడికల్​ శాఖ హైఅలర్ట్​

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ జిల్లాలో డెంగ్యూ డేంజర్​ బెల్స్​ మోగిస్తోంది.  జనవరి నెల నుంచి వరుసగా 134  కేసులు నమోదు కాగా  ఈ ఒక్క నెలలో మెడికల్​ ఆఫీసర్లు తొమ్మిది కేసులు గుర్తించారు. వైరల్ జ్వరాలు , డయేరియా, టైఫాయిడ్​ ప్రజలను బేజారు చేస్తోంది.  సీజనల్​వ్యాధులు వ్యాప్తి చెందే  టైం కావడంతో జిల్లా అధికారులను కోఆర్డినేట్​ చేసి పరిస్థితిని అదుపులో పెట్టడానికి  స్టేట్ ​హెల్త్​ కమిషనర్​ ఆర్​వీ కర్ణన్​ను గవర్నమెంట్​ నియమించింది. ఆయన ఉమ్మడి జిల్లా సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. డెంగ్యూ కేసులపై  దృష్టి సారించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని శనివారం జిల్లా అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. 

అధికారుల అలర్ట్

జనవరి నెల నుంచి డెంగ్యూ కేసులు క్రమంగా నమోదవుతున్నాయి. మొదట టౌన్​ఏరియాల్లోనే దీని ప్రభావం ఉందని భావించగా విలేజ్​లకు విస్తరించింది. ఈ ఒక్క నెలలో తొమ్మిది కేసులు రిజస్టర్ అయ్యాయి. జూన్​ నుంచి డయేరియా 263,  37 టైఫాయిడ్​, 467 వైరల్​ ఫీవర్​ కేసులు సర్కారు దవాఖానాలలో గుర్తించి ట్రీట్​మెంట్ ఇచ్చారు. సర్కారు ఆదేశాలతో మెడికల్​ఆఫీసర్లు అలెర్ట్ అయ్యారు. ​ ప్రతి ఇంటిని విజిట్​చేసి ఆరోగ్య సమాచారం సేకరించేందుకు రెడీ అయ్యారు. అంగన్​వాడీ, ఆశావర్కర్లను అప్రమత్తం చేశారు. మున్సిపాలిటీ, పంచాయతీరాజ్​, మెడికల్​ హెల్త్​డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ తో  కోఆర్డినేట్ ​చేసి పరిస్థితిని సాధారణ స్థితికి తేవాలనే ప్రణాళికతో ఆదివారం నుంచి ముందుకు వెళ్లనున్నారు. ఇక ప్రైవేట్​ హాస్పిటల్స్​లో ఈ కేసులు వందల సంఖ్యలో వెళ్తుండగా అక్కడ ప్లేట్ లేట్స్​ పేరుతో రూ.లక్షల వ్యాపారానికి తెరలేపారు.  

ఫ్రైడే.. డ్రైడే

 కూలర్లు, ఫ్రిడ్జ్ వెనుక భాగంలో ఉండే నీరు, పూల కుండీలు, నల్లా కనెక్షన్​ గుంతలు, వాడని టాయిలెట్స్​, కొబ్బరి చిప్పలు, నీటి తొట్టెలు, పశువుల తొట్టెలు తదితర చోట్ల ఈజీగా దోమలు వృద్ధి చెందుతాయి.  పరిశుభ్రత పెంపొందించేలా ఆఫీసర్లు స్పెషల్​ ప్రోగ్రాం చేపట్టారు. ప్రతి  ఫ్రేడేను డ్రైడేగా పాటించేలా ప్రజలను అలర్ట్​ చేస్తున్నారు. 

అలర్ట్ గా ఉన్నాం. ..

డెంగ్యూ, వైరల్​ ఇతర సీజనల్​ వ్యాధుల దృష్ట్యా అలర్ట్​గా ఉన్నాం. పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటే చాలా వరకు సమస్య రాదు. డెంగ్యూ జ్వరానికి భయపడాల్సిన పనిలేదు. బాడీ డీ హైడ్రేట్​ కాకుండా ఓఆర్​ఎస్​, పండ్ల రసాలు, రాగిజావ,  కొబ్బరి నీళ్లు తాగాలి.  ప్లేట్ లేట్స్ 20 వేలకు పడిపోతేనే హాస్పిటల్స్ లో చేరాలి. టెన్షన్​ పడుతూ చాలా మంది ప్రైవేట్​ హాస్పిటల్స్​లో చేరుతున్నారు. ప్రైవేటు హాస్పిటళ్లలో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని  కంప్లైంట్ ​వస్తే యాక్షన్​ తీసుకుంటాం. 
డీఎంహెచ్​వో డాక్టర్ తుకారాం రాథోడ్​