
అమరావతి, వెలుగు: ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 11,602 మందికి టెస్టు చేయగా, 135 మందికి పాజిటివ్ వచ్చింది. ఇతర రాష్ట్రా ల నుంచి వచ్చిన 38, ఫారిన్ నుంచి వచ్చిన 9 మందికి కరోనా సోకినట్లు తేలింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,261కి చేరి నట్లు ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ గురువారం బులెటిన్ లో పేర్కొంది. తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో మరొకరు కరోనాతో మృతి చెందినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 80కి చేరి నట్లుతెలిపింది. ఒక్కరోజే 65 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారని , ఇప్పటి వరకు మొత్తం 2,540 మంది డిశ్చార్జ్ అయినట్లు చెప్పింది. 1,641 మందికి హాస్పిటళ్లల్లో ట్రీట్ మెంట్ కొనసాగుతోంద ని తెలిపింది. ఇప్పటివరకు 5 లక్షల 10 వేల 318 మందికి టెస్టులు చేసినట్లుఅధికారులు చెప్పారు. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య 54.67 శాతానికి పెరిగినట్లు చెప్పారు.