135ఏళ్ళ చరిత్రకు గాయం.. ధ్వంసమైన చార్మినార్ గడియారం..

చార్మినార్ కే కాదు, దాని మీదున్న గడియారాలకు కూడా ఘన చరిత్ర ఉంది.1889లో చార్మినార్ కు నలువైపులా గడియారాన్ని అమర్చారు. 135 ఏళ్ళ చరిత్ర ఉన్న గడియారం ధ్వంసమైంది. చార్మినార్ కు మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో ఇనుప పైప్ తగిలి గడియారం ధ్వంసమయ్యింది.

అయితే, గడియారం పాక్షికంగానే ధ్వంసం కావడంతో ఇంకా పని చేస్తోంది. మరి, 135ఏళ్ళ చరిత్ర ఉన్న పురాతన గడియారాన్ని మర్చి కొత్తది అమర్చుతారా లేక దానికే రిపేర్ చేస్తారా అన్నది వేచి చూడాలి.