మణిపూర్లో రేపే తొలి విడత పోలింగ్

మణిపూర్లో రేపే తొలి విడత పోలింగ్

మణిపూర్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఐదు జిల్లాల్లోని 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన బూత్లకు చేరుకున్నారు. మణిపూర్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో మొత్తం 173 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 15 మంది మహిళా అభ్యర్థులున్నారు. తొలిదశలో ఎన్నిక జరగనున్న సీట్లలో 29, ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్తో పాటు బిష్ణుపూర్లో ఉండగా.. మిగిలిన 9 స్థానాలు కంగ్పోక్పీ, చురాచంద్పూర్, పెర్జవాల్ జిల్లాల్లో ఉన్నాయి. 

తొలి విడతలో ఎన్నిక జరగనున్న 38 నియోజకవర్గాల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ 35, జేడీయూ 28, ఎన్పీపీ 27 సీట్లలో బరిలో దిగుతున్నాయి. శివసేన 7, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే, ఎన్సీపీ 6, లోక్ జనశక్తి పార్టీ 3,కుకీ పీపుల్స్ అలయెన్స్, కుకీ నేషనల్ అసెంబ్లీ రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి. ముఖ్యమంత్రి బిరేన్ సింగ్, డిప్యూటీ సీఎం యమ్నమ్ జోయ్ కుమార్, స్పీకర్ కేమ్ చంద్ సింగ్, మంత్రి బిశ్వజిత్ సింగ్, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తొలి దశలోని పోలింగ్ జరగనుంది. మార్చి 5న రెండో దశలో మిలిగిన 22 సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడుతాయి.
 

మరిన్ని వార్తల కోసం..

రైతులపై కేంద్రం సవతి తల్లి ప్రేమ

పార్టీ ప్రక్షాళన కోసమే డిజిటల్ సభ్యత్వ నమోదు