
నవోదయ విద్యాలయ సమితి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఎన్‌వీఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న ఎన్‌వీఎస్ ప్రాంతీయ కార్యాలయాలు, ఎన్‌ఎల్‌ఐలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
సెలెక్షన్: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవాలి. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500
(ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు) రూ.1000 (ఇతర పోస్టులకు). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. వివరాలకు www.navodaya.gov.in సంప్రదించాలి.