
వరంగల్ జిల్లా నర్సంపేటలో 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు కౌన్సిలర్లు. మరో రెండు రోజుల తర్వాత పదవులకు కూడా రాజీనామా చేస్తామని కౌన్సిలర్లు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వైఖరి నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు కౌన్సిలర్లు.