కామారెడ్డి జిల్లాలో నవోదయ ప్రవేశ పరీక్షకు14 సెంటర్లు

కామారెడ్డి టౌన్, వెలుగు : ఈ నెల 18న జరిగే నవోదయ ప్రవేశ పరీక్షకు కామారెడ్డి జిల్లాలో 14 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష ఏర్పాట్లపై శుక్రవారం తన చాంబర్​లో ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.  ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.  

ప్రతి సెంటర్​కు చీప్​ సూపరింటెండెంట్, డిఫార్మెంట్​ఆఫీసర్, ఇన్విజిలేటర్లను నియమించామన్నారు.  ప్రతి సెంటర్​లో తాగునీటి వసతి కల్పించాలని,  పరిసరాలను క్లీన్​గా ఉంచాలన్నారు. కరెంట్​సప్లయ్​ఉండాలని, మెడికల్ స్టాప్​అందుబాటులో ఉండాలని సూచించారు.