బొగ్గు గనిలో పేలుడు.. 14 మంది చిన్నారులు మృతి

చైనాలో ఘోరం జరిగింది. బొగ్గు గనిలో పేలుడు సంభవించి 14 మంది చిన్నారులు చనిపోయారు. సిచువాన్ ఇండస్ట్రీ గ్రూప్‌కు చెందిన షణముషు బొగ్గు గనిలో దాదాపు 346 మంది మైనర్లు భూగర్భంలో పనిచేస్తున్నారు. వీరంతా గనిలో పనుల్లో ఉండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా, చాలా మంది గాయపడ్డారు. కాగా.. మరో ఇద్దరు మైనర్లు ఇంకా గనిలోనే చిక్కుకున్నట్లు సమాచారం. గనిలో పేలుడు జరగడంతో ఆ ప్రదేశం అంతా పొగతో చీకటిమయంగా మారింది. దాంతో గాయపడ్డవారిని గుర్తించడం పోలీసులకు కష్టమవుతుంది. గనిలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.