- నర్సంపేట మున్సిపల్చైర్పర్సన్పై అవిశ్వాసం వీగడంతో నారాజ్
- బలం లేదని మీటింగ్‌కు హాజరుకాని మెజారిటీ కౌన్సిలర్లు
- మాజీ ఎమ్మెల్యే తీరుకు నిరసనగానే రిజైన్లన్న కౌన్సిలర్లు
వరంగల్ / నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో చైర్పర్సన్గుంటి రజనీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసాన్ని ప్రతిపాదించిన బీఆర్ఎస్అసమ్మతి కౌన్సిలర్లు మెజార్టీ లేకపోవడంతో సమావేశానికి గైర్హాజరయ్యారు. బల్దియా వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీరును నిరసిస్తూ అసమ్మతి కౌన్సిలర్లు పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. నర్సంపేట మున్సిపల్చైర్పర్సన్రజనీపై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ బీఆర్ఎస్కౌన్సిలర్లు కలెక్టర్‌కు లెటర్ ఇచ్చారు. దీనిపై చర్చించేందుకు మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ప్రకటించారు. నర్సంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు 18 మంది, కాంగ్రెస్‌కు ఆరుగురు కౌన్సిలర్లు ఉండగా.. ప్రత్యేక సమావేశానికి ఒక్కరు కూడా హాజరు కాలేదు. దీంతో సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం కూడా రాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్టు ప్రిసైడింగ్ఆఫీసర్, ఆర్డీఓ కృష్ణవేణి ప్రకటించారు. బీఆర్ఎస్ కు చెందిన 18 మంది కౌన్సిలర్లలో నలుగురు మాత్రమే చైర్ పర్సన్‌కు మద్దతివ్వగా..ముగ్గురిని పొరుగు రాష్ట్ర క్యాంప్‌కు తరలించారు. మరొకరు ఇంట్లోనే ఉన్నారు. చైర్‌పర్సన్‌పై అసంతృప్తితో ఉన్న 14 మంది కౌన్సిలర్లు ఐక్యంగా ఉన్నా అవిశ్వాసం నెగ్గాలంటే మరో ఇద్దరి మద్దతు కావాల్సి ఉంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరుగురు అవిశ్వాసానికి దూరంగా ఉండడంతో వారి బలం సరిపోలేదు. దాంతో వారు మీటింగ్‌కు హాజరుకాలేదు.
పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్లు
అవిశ్వాసం వీగిపోవడంతో నారాజ్అయిన 14 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారు మీడియాతో మాట్లాడుతూ, అవిశ్వాసానికి దూరంగా ఉన్న ముగ్గురిపై మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి రెండు రోజుల్లో చర్య తీసుకోకపోతే కౌన్సిలర్ పదవులకు కూడా రాజీనామా చేస్తామని చెప్పారు. మున్సిపల్వైస్ చైర్మన్మునిగాల వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు మినుముల రాజు, శీలం రాంబాబు, దేవోజు తిరుమల, నాగిశెట్టి పద్మ, రుద్ర మల్లీశ్వరి, జుర్రు రాజు, వేల్పుగొండ పద్మ, బానాల ఇందిర, లూనావతు కవిత, రామసహాయం శ్రీదేవి, గందె రజిత, గంప సునీత ఉన్నారు.