కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ సిటీలోని అంబేద్కర్ స్టేడియంలో రూ.14కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో స్పోర్ట్స్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. మంగళవారం కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 22 షెట్టర్లు, 22 రూమ్స్‌తో పాటు వెయ్యిమంది కెపాసిటీ గల బ్యాంకెట్ హాల్ నిర్మిస్తున్నామన్నారు.
పనులను పూర్తిచేసి డిసెంబర్ 31లోపు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు స్టేడియంలో అన్ని రకాల వసతి, సౌకర్యాలు కల్పించామన్నారు. బీఆర్ఎస్ లీడర్ ఎడ్ల అశోక్, మున్సిపల్ఆఫీసర్లు పాల్గొన్నారు.