అమృతంలా ఆద్యంతం నవ్వించేలా ‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో’..

అమృతంలా ఆద్యంతం నవ్వించేలా ‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో’..

అంకిత్ కొయ్య, శ్రియా కొంతం జంటగా శ్రీహర్ష  దర్శకత్వంలో సత్య నిర్మించిన  చిత్రం ‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో’.  సోమవారం ఈ సినిమా నుంచి  స్నీక్ పీక్‌‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌‌లో అంకిత్ కొయ్య మాట్లాడుతూ ‘కొన్నిసార్లు ఎదుటి వాళ్ల కష్టాలను, బాధల్ని చూసి మనం నవ్వుకుంటాం. అలాంటి పాత్రలోనే నేను నటించా. అమృతం సీరియల్‌‌ తరహాలో ఈ సినిమా ఆద్యంతం నవ్విస్తుంది’ అని చెప్పాడు.

‘కొత్త వాళ్లమంతా కలిసి తీసిన ఈ చిత్రాన్ని  ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా.  వెన్నెల కిశోర్, అంకిత్ మధ్య వచ్చే ట్రాక్ హిలేరియస్‌‌గా ఉంటుంది’ అని  డైరెక్టర్ శ్రీహర్ష చెప్పాడు.  నిర్మాత సత్య మాట్లాడుతూ ‘సెన్సిబుల్ మెసేజ్ ఇస్తూనే ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. ట్రైలర్ తరువాత మా సినిమాకు మరింత పాజిటివ్ వైబ్ వచ్చింది’ అని అన్నారు.  త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌‌ను ప్రకటిస్తామని కో ప్రొడ్యూసర్ నాగు చెప్పారు.