
మనోజ్ పుట్టూర్, ‘రథం’ ఫేమ్ చాందిని భగ్వనాని జంటగా నాగరాజు బోడెం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘14 డేస్ లవ్’. సుప్రియ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై హరిబాబు దాసరి నిర్మించారు. రాజా రవీంద్ర, సనా, అంజలి, రాజా శ్రీధర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం విడుదలవుతోంది.
‘సంప్రదాయ విలువలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఓ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి.. వాళ్ల మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు చెప్పారు అనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం’ అని దర్శకనిర్మాతలు తెలిపారు.