HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 14 రోజుల రిమాండ్

HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 14 రోజుల రిమాండ్

HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో శివబాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా బంగారం, వెండి, నగదు ను సీజ్ చేశారు. అనంతరం బాలకృష్ణను అరెస్ట్ చేసిన అధికారులు గురువారం ( జనవరి 25)న నాంపల్లిఏసీబీ కోర్టులో హాజరు పర్చారు. మరికాసేపట్లో బాలకృష్ణను నాంపల్లి కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. 
 
బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో శివబాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు సోదాల్లో బాలకృష్ణ ఇంటితోపాటు బంధువులు, సహచరులు ఇండ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రూ.99.60 లక్షల నగదు, 1988 గ్రాముల బంగారం, 6 కేజీల వెండిని సీజ్ చేశారు. దాదాపు 8.26 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణపై 13 (1) (b) , 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.