రికార్డ్ స్థాయిని దాటిన కడెం...14 గేట్లు ఓపెన్.. లోతట్టు గ్రామాలకు హెచ్చరిక

రికార్డ్ స్థాయిని దాటిన కడెం...14 గేట్లు ఓపెన్.. లోతట్టు గ్రామాలకు హెచ్చరిక

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ ఎగువన కురుస్తోన్న వర్షాలతో నిండుకుండలా మారుతోంది. ఎగువన నుంచి 3 లక్షల  87 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్ లోకి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 697 అడుగులుగా ఉంది.14 వరద గేట్లు ఓపెన్ చేసి.. దిగువకు 2 లక్షల 47 వేల  క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.

 లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఖాళీ చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి ప్రాజెక్టుకు వరద ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి పర్యాటకులు సందర్శిస్తున్నారు. వరద ఉధృతి వల్ల ప్రాజెక్ట్ పైకి పర్యాటకులను అనుమతించడంలేదు.