
గచ్చిబౌలి, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 14 అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్అధికారులు సీజ్ చేశారు. శేరిలింగంపల్లి సర్కిల్గచ్చిబౌలి డివిజన్లోని టీఎన్జీఓ కాలనీలో రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని ఆరు, ఏడు అంతస్తులు నిర్మించడం, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మరికొన్ని బిల్డింగ్లు నిర్మించారు. వీటిపై ఫిర్యాదులు రావడంతో శేరిలింగంపల్లి సర్కిల్టౌన్ ప్లానింగ్ఏసీపీ వెంకట రమణ ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం అటువంటి 14 బిల్డింగ్లను పోలీసుల బందోబస్తు మధ్య సీజ్ చేశారు.