
అమన్ (జోర్డాన్): ఆసియా అండర్–15, 17 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు చెందిన 14 మంది బాక్సర్లు ఫైనల్స్‌కు అర్హత సాధించారు. విమెన్స్ అండర్–15 సెమీస్‌లో కోమల్ (30–33 కేజీ), నవ్య (58 కేజీ), సునైనా (61 కేజీ) రిఫరీ స్టాప్‌డ్ కంటెస్ట్ ద్వారా తమ ప్రత్యర్థులపై నెగ్గారు. ఖుషి అహ్లవత్ (35 కేజీ), తమన్నా (37 కేజీ), ప్రిన్సి (52 కేజీ), త్రుషానా మెహితే (67 కేజీ) తమ అపోనెంట్స్‌పై పూర్తి ఆధిపత్యం చూపెట్టారు. మిల్కీ మీనం (43 కేజీ), 3–2తో పోరాడి నెగ్గింది. స్వి (40 కేజీ), వాన్షికా (70+ కేజీ)లకు బై లభించడంతో ఫైనల్‌కు చేరారు. మెన్స్ అండర్–15 సెమీస్‌లో వినోద్, రుద్రాక్ష్ సింగ్ కైడమ్ (46 కేజీ), అభిజీత్ (61 కేజీ), లక్షయ్ పోగట్ (64 కేజీ) ఈజీగా విజయాలు సాధించారు.