పాల్వంచ, వెలుగు : పాల్వంచలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపం లో ఎక్సైజ్ సిబ్బంది బుధవారం రూ.3.5 లక్షల విలువైన 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ నాగే శ్వరరావు తెలిపారు. గంజాయిని ఒరిస్సా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో పాల్వంచ బస్టాండ్ వద్ద కాపు కాసి వారిని పట్టుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన భవితోష్ ఒరిస్సా కు చెందిన కిషోర్ గా వారిని గుర్తించారు.
వారి నుంచి గంజాయితోపాటు, రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమో దు చేసి పాల్వంచ ఎక్సైజ్ స్టేష న్ కు తరలించారు. తనిఖీ ల్లో ఎస్సై గౌతమ్, కానిస్టేబుళ్లు హబీబ్ పాషా, ఎల్ ఆర్ కే గౌడ్, వెంకటనారాయణ, గురవయ్య, సుమంత్ పాల్గొన్నారు.