అస్సాంలో పాక్ అనుకూల​ నినాదాలు.. 14 మంది అరెస్టు

అస్సాంలో పాక్ అనుకూల​ నినాదాలు.. 14 మంది అరెస్టు

గువాహటి: పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడంతో శనివారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు అరెస్టు అయిన వారి సంఖ్య 14కు చేరుకుందని చెప్పారు. అవసరమైతే వారిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ ఎస్ ఏ) కింద చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శనివారం గువాహటిలో జరిగిన ఒక కార్యక్రమంలో హిమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘భారత్, పాకిస్తాన్ మధ్య ఎటువంటి పోలికలు లేవు. ఆ రెండు శత్రు దేశాలు. ఎప్పటికి అలాగే ఉండాలి. భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో కృషక్ ముక్తి సంగ్రామ్ నాయకుడిని శుక్రవారం అరెస్టు చేశాం. ఇటువంటి నినాదాలు చేస్తే ఎవరినైనా అరెస్టు చేస్తం” అని వివరించారు.