వీధి కుక్కల దాడిలో 14 మందికి గాయాలు

రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు కలవరపెడుతున్నాయి. కొన్ని చోట్ల ప్రాణాలు పోతుండా.. మరి కొన్ని చోట్ల గాయాలపాలవుతున్నారు.  ఇటీవలే వరంగల్ కాజీపేటలో వీధి కుక్కల దాడిలో పదేళ్ల బాలుడు  చనిపోయిన ఘటన అందరినీ కలచివేసిన సంగతి తెలిసిందే.  లేటెస్ట్ గా మహబూబాబాద్ జిల్లా  మరిపెడ మండలం ఆనేపురం వెంకయ్య తండా, మేఘ్య తండాలలో   14 మందిపై వీధి కుక్కల  దాడి చేశాయి.  గాయపడ్డ వారిలో కొందరు మహిళలు, కొందరు  చిన్నపిల్లలు ఉన్నారు.   కుక్క కాటుకు గురైన వారందరికి చికిత్స కోసం మరిపెడ  పీహెచ్ సీ కి తరలించారు. నిన్న కూడా(మే 20న) కూడా గుంజేడు  గ్రామంలోని  మూసలమ్మ ఆలయ సమీపంలో 16 మంది భక్తులపై కుక్కలు దాడి చేశాయి.

వీధి కుక్కల దాడులు పెరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల ప్రాణాలంటే లెక్కలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.  వీధి కుక్కలను నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.