అపాయింట్‌మెంట్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని 14 పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను (POPSK) మే 20 శనివారం నుంచి ప్రారంభించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ సేవలు సిద్దిపేట, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మెదక్, భోంగీర్, మంచిర్యాల, కామారెడ్డి, వనపర్తి, మేడ్చల్, వికారాబాద్‌లలోనూ అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.
పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్‌లతో సహా మొత్తం 700 అపాయింట్‌మెంట్‌లను మే 20న సాయంత్రం 4.30 గంటలకు పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అందుకోసం www.passportindia.gov.in పోర్టల్ లేదా mPassportseva యాప్ ద్వారా అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయవచ్చు.
దరఖాస్తుదారులందరూ తమ పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ సంబంధిత అవసరాల కోసం మధ్యవర్తులు/టౌట్‌లు/బ్రోకర్‌లను సంప్రదించవద్దని, ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.