గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని భట్లూరులో కరోనా విజృంభించింది. కరోనాతో పాఠశాలలు మూతపడటంతో.. ఓ ఉపాధ్యాయుడు దాదాపు 50 మంది విద్యార్థులకు ట్యూషన్ నిర్వహిస్తున్నాడు. అయితే ఉపాధ్యాయుడికి కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. దాంతో ట్యూషన్‌కి వస్తున్న స్టూడెంట్లకు కూడా కరోనా సోకింది. ఉపాధ్యాయుడితో పాటు 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విద్యార్థులంతా 7 ఏళ్లలోపు వాళ్లు కావడం గమనార్హం. అయితే కరోనా విద్యార్థులకే కాకుండా.. విద్యార్థుల నుంచి వారి తల్లిదండ్రులకు కూడా సోకింది. దాంతో ఒకే రోజు గ్రామంలో 39 మంది కరోనా బారినపడ్డారు. దాంతో వీరందరినీ గుంటూరు క్వారంటైన్ సెంటర్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ఎస్సీ కాలనీని అధికారులు కంటేయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. కరోనా కేసులతో ప్రస్తుతం గ్రామంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అధికారులు గ్రామంలో పర్యటిస్తూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు.
For More News..