కోరుట్ల పట్టణంలోని గురుకుల విద్యార్థులకు 14 మందికి అస్వస్థత

కోరుట్ల పట్టణంలోని గురుకుల విద్యార్థులకు 14 మందికి అస్వస్థత

కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ గురుకుల స్కూల్‌‌‌‌లో విద్యార్థులు అస్వస్థతకు గురికాగా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. మూడు రోజులుగా విద్యార్థులు దగ్గు, జలుబు, జ్వరం, కడుపునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం విద్యార్థులు బ్రేక్‌‌‌‌ ఫాస్ట్‌‌‌‌గా ఇడ్లీ, సాంబార్‌‌‌‌‌‌‌‌ తిన్నారు. అనంతరం  7వ తరగతికి చెందిన 14 మంది విద్యార్థులకు జ్వరం తీవ్రం కాగా సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, ఏరియా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.

అనంతరం ఏడుగురిని డిశ్చార్జ్ చేయగా.. మరో ఏడుగురు హాస్పిటల్‌‌‌‌లోనే చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే  కల్వకుంట్ల సంజయ్​, డీఎంహెచ్‌‌‌‌వో ప్రమోద్ కుమార్, ఇన్‌‌‌‌చార్జి తహసీల్ధార్​ఫారుఖ్​, ఎంఈవో నరేశం హాస్పిటల్​కు చేరుకుని విద్యార్థుల ఆరోగ్యస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని, ఎలాంటి ఇబ్బందులు లేదని డాక్టర్లు పేర్కొన్నారు. అనంతరం గురుకులాన్ని డీఎంహెచ్‌‌‌‌వో  సందర్శించారు.