సెల్​ఫోన్​కు చార్జింగ్ పెడుతూ 14 ఏళ్ల బాలుడు​ మృతి.. వరంగల్​ జిల్లాలో ఘటన

సెల్​ఫోన్​కు చార్జింగ్ పెడుతూ 14 ఏళ్ల బాలుడు​ మృతి.. వరంగల్​ జిల్లాలో ఘటన

నర్సంపేట, వెలుగు: విద్యుత్​ షాక్​తో వరంగల్​ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన సంపంగి రాకేశ్(14) చనిపోయాడు. స్థానిక హైస్కూల్​లో 8వ తరగతి చదువుతున్నాడు. సెకండ్​ సాటర్​డే కావడంతో ఇంటి వద్దే ఉన్నాడు. సెల్​ఫోన్​కు చార్జింగ్​ పెట్టే క్రమంలో విద్యుత్​ షాక్​ తగలడంతో చనిపోయాడు. రాశేక్​ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.