న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం రూ.2,381 కోట్ల విలువైన (1.40 లక్షల కిలోలకు పైగా) డ్రగ్స్‌ను అధికారులు ధ్వంసం చేశారు. ఆ దృశ్యాలను ఢిల్లీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్‌లో వీక్షించారు. ఇందులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) హైదరాబా ద్ యూనిట్ స్వాధీనం చేసుకున్న 6,590 కిలోలు, ఇండోర్ యూనిట్ స్వాధీనం చేసుకున్న 822 కిలో లు, జమ్మూ యూనిట్ స్వాధీనం చేసుకున్న 356 కిలోల డ్రగ్స్ఉన్నట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ను ధ్వంసం చేయడాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిం చిన అనంతరం "డ్రగ్స్ స్మగ్లింగ్, జాతీయ భద్రత" అనే అంశంపై జరిగిన సమావేశంలో అమిత్‌షా మాట్లాడారు.
" ఎవరు కూడా డ్రగ్స్‌బారిన పడకుండా చూడడం.. దేశాన్ని డ్రగ్స్‌రహితంగా, సురక్షితంగా మార్చడమే మా లక్ష్యం. అందుకు అన్ని విధాలా సహకరించాలని ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌గవర్నలను విజ్ఞప్తి చేస్తున్నాను" అని అన్నారు. ఏడాదిలో రూ.12 వేల కోట్ల విలువైన 10 లక్షల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశామని, ఇది చాలా గొప్ప విజయమని హోంమంత్రి పేర్కొన్నారు. "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో ఇంత పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చడంలో పాల్గొన్న ప్రజలందరికీ అభినందనలు" అని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతోపాటు అన్ని ఏజెన్సీలు ఒకే వేదికపైకి వచ్చినప్పుడే దేశాన్ని డ్రగ్స్‌రహితంగా మార్చగలుగుతామని చెప్పారు. డ్రగ్స్ స్మగ్లర్ల ఫైనాన్షియల్చెయిన్ను ఛేదించే వరకు డ్రగ్స్‌పై పోరాటం పూర్తికాదని అమిత్‌షా అన్నారు. ఇంతకుముందు డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రధాన ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రెసెంట్ అని పిలిచేవారని, అయితే దీనికి 'డెత్ ట్రయాంగిల్', 'డెత్ క్రెసెంట్' అని పేర్లు పెట్టాలని ఇండియన్ గవర్నమెంట్ అంతర్జాతీయంగా ప్రతిపాదించిందని ఆయన తెలిపారు. ఈ విధానం డ్రగ్స్‌పై తమ పోరాట దిశ, తీవ్రతను చూపుతుందని ఆయన చెప్పారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఒక్క క్షణం అలసత్వం వహించినా మొత్తం ఉద్యమాన్ని పాడు చేస్తుందని హోంమంత్రి అన్నారు..