మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చింది మోడీ సర్కార్. గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరకు ఈ పెంపు వర్తిస్తుంది. మార్చి 22 నుంచే రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి రానుంది. చివరిగా 2021 అక్టోబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. అప్పటి నుంచి వంట గ్యాస్ ధర నిలకడగానే వచ్చింది. దీనికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎన్నికలు ముగియడంతో కేంద్రం ధరలు పెంచేసింది.
అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.949 అయ్యింది. ఇది వరకు ఇక్కడ సిలిండర్ ధర రూ.899గా ఉండేది. ఇక హైదరాబాద్‌లో అయితే సిలిండర్ ధర రూ.1,002కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకునే రూ.30 కలుపుకుంటే సిలిండర్ ధర రూ.1032 అయ్యిందని చెప్పుకోవచ్చు. అలాగే ఏపీలో అయితే సిలిండర్ ధర రూ.1008కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకనే చార్జీలు కలుపుకుంటే సిలిండర్ పొందాలంటే రూ.1040 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.1000 పైకి తీసుకెళ్లింది.
14.2 kg Domestic cooking gas LPG price hiked by Rs 50 per cylinder. Will now cost Rs 949.50 effective from today: Sources pic.twitter.com/jYvh0RWZG5
— ANI (@ANI) March 22, 2022
ఇవి కూడా చదవండి:
నా భూమిని ఇప్పించండి.. లేదా సూసైడ్‌కు పర్మిషన్ ఇయ్యండి?
చిన్నఇన్వెస్టర్లకు పెద్ద దెబ్బ