142 క్వింటాళ్ల పీడీఎస్‌ రైస్ పట్టివేత

142 క్వింటాళ్ల పీడీఎస్‌ రైస్ పట్టివేత

అయిజ, వెలుగు:  అయిజ కర్నూలు మార్గంలోని వ్యవసాయ పొలంలో ఉన్న షెడ్డులో  అక్రమంగా నిల్వ ఉంచిన 356 బస్తాలు (142 క్వింటాళ్లు) పీడీఎఫ్ రైస్ ను  శనివారం  పట్టుకున్నట్లు ఎస్సై విజయభాస్కర్ తెలిపారు.  ఓ  డీసీఎం షెడ్డు వద్దకు చేరుకోగా అక్కడ పీడీఎస్  రైస్ పట్టుబడ్డాయని తెలిపారు.  విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ బ్రహ్మయ్యకు తెలియజేశారు.  బాధ్యులైన శాంతినగర్‌‌కు చెందిన భాస్కర్, పరమేశ్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.  బియ్యాన్ని అయిజ సివిల్ సప్లై గోదాంకు తరలించారు.