
లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లో మార్చి 15న అరెస్ట్ చేసిన ఈడీ ఢిల్లీకి తరలించారు. వైద్య పరిక్షల అనంతరం రేపు ( మార్చి 16) ఉదయం 11 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈరోజు రాత్రికి కవితను ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే ఉంచనున్నారు.ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద 144వ సెక్షన్ ను విధించారు. కేంద్ర ప్రభుత్వ బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరినీ ఈడీ కార్యాలయం వైపునకు రాకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.