జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 144 సెక్షన్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 144 సెక్షన్

భూపాలపల్లిలో కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మధ్య బహిరంగ సవాళ్ల నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 2వ తేదీ నుంచి వారం రోజులపాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు. శాంతిభద్రతలకు విగాథం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల ర్యాలీలు, సమావేశాలు, బల ప్రదర్శనపై నిషేధం విధించారు.

జిల్లాలో రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని.., ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా బల ప్రదర్శనకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. 2వ తేదీ నుండి వారం వరకు జిల్లా కేంద్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున గుంపులు, గుంపులుగా ఎవరూ గుమిగూడవద్దన్నారు. జన జీవనానికి ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాజకీయ పార్టీల నాయకుల సవాళ్లకు, బహిరంగ చర్చలకు పోలీసు శాఖ అనుమతి లేదని ఎస్పీ సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు.