స్టాక్ మార్కెట్ పేరుతో ..9 నెలల్లో రూ.1,454 కోట్ల దోపిడి

స్టాక్ మార్కెట్ పేరుతో ..9 నెలల్లో  రూ.1,454 కోట్ల దోపిడి
  • ఇన్వెస్ట్​మెంట్, ట్రేడింగ్ అంటూ రూ.841 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
  • రాష్ట్రవ్యాప్తంగా 9 నెలల్లో రూ.1,454 కోట్ల సైబర్ మోసాలు  
  • ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్​లోనే రూ.వెయ్యి కోట్ల దోపిడీ
  • 85 వేల మంది బాధితులు.. ఎక్కువ మంది ఐటీ, ప్రైవేట్ ఉద్యోగులే  
  • స్టాక్ మార్కెట్ తర్వాత క్రెడిట్/డెబిట్ కార్డ్స్, డిజిటల్ అరెస్ట్ మోసాలు అధికం
  • ఇప్పటి వరకు రూ.176 కోట్లు సీజ్.. 460 మంది సైబర్ నేరస్తుల అరెస్టు 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ అడ్డాగా సాగుతున్న సైబర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. సైబర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌సేఫ్టీపై పోలీసులు ప్రచారం చేస్తున్నా.. మోసపోతున్నోళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 20 వరకు 85 వేల మందిని సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. రూ.1,454 కోట్లు కొట్టేశారు. బాధితుల్లో ఎక్కువ మంది స్టాక్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ మోసాలకు బలయ్యారు. స్టాక్ మార్కెట్​లో ఇన్వెస్ట్​మెంట్, ట్రేడింగ్ పేరుతో బాధితుల నుంచి రూ.841 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. సైబర్ మోసాలకు బలవుతున్న బాధితుల్లో ఎక్కువ మంది ఐటీ, ప్రైవేట్ ఉద్యోగులే ఉన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 85 వేల కేసులు నమోదైతే.. అందులో ఒక్క గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్​లోనే 54,103 కేసులు ఉన్నాయి. బాధితుల నుంచి రూ.1,009 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. ఈ కేసులకు సంబంధించి టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటి వరకు రూ.176 కోట్లు ఫ్రీజ్ చేసి, 460 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసింది. 

90 శాతం మంది విద్యావంతులే.. 

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటున్నాయి. అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొబైల్ డేటా, లక్షల సంఖ్యలో యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనెక్టివిటీకి నిలయంగా మారాయి. అలాగే కరెన్సీ నోట్లకు బదులు డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతున్నాయి. వీటన్నింటినీ సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో బాధితులను ట్రాప్ చేసి, ఆ తర్వాత లింక్స్ పంపించి.. వాళ్ల బ్యాంక్ అకౌంట్లను కొల్లగొడుతున్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికగా దాదాపు 185 రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిగ్గజాల వరకు సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ప్రతిఏటా నమోదవుతున్న సైబర్ నేరాల బాధితుల్లో 90 శాతం మంది విద్యావంతులే ఉంటున్నారు. 

కొత్త తరహా మోసం.. డిజిటల్ అరెస్టు 

దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కర్నాటకకు చెందిన బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. హిందీ మాట్లాడే రాష్ట్రాలు, మెట్రో సిటీలను సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నేరగాళ్లు టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నారు. డార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైట్లలో కొనుగోలు చేసిన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏజెన్సీల ద్వారా సేకరించిన బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్ల వివరాలతో మోసాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫెడెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొరియర్, కస్టమ్స్, ట్రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీబీఐ, సైబర్ క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసుల పేరుతో డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ  కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఫెడెక్స్ కొరియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన పార్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బంగారం, నిషేధిత వస్తువులు ఉన్నాయని ఢిల్లీ, ముంబై పోలీసుల పేరుతో స్కైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియో కాల్స్ చేస్తున్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నామంటూ అర్ధరాత్రి గంటల తరబడి వేధింపులకు గురిచేస్తున్నారు. అరెస్ట్ చేస్తామని బెదిరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. 

అవగాహనతోనే నియంత్రణ సాధ్యం

సైబర్ సెక్యూరిటీ బ్యూరో,1930 మంచి ఫలితాలు ఇస్తున్నాయి.సైబర్ మోసాల్లో బాధితులు కోల్పోయిన డబ్బును తిరిగి వారికి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటికే రూ.176 కోట్లు ఫ్రీజ్ చేశాం. 7,242 మంది బాధితులకు రూ.94.6 కోట్లు రీఫండ్ చేశాం. మిగతా డబ్బు కూడా కోర్టు ఆదేశాలతో బాధితులకు అందిస్తాం. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన ఉన్నప్పుడే నియంత్రణ సాధ్యం. బాధితుల్లో 90శాతం మంది విద్యావంతులే ఉంటున్నారు. ప్రస్తుతం ఫెడెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొరియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడితే సివిల్, సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాలి. - శిఖా గోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డైరెక్టర్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో