
- కొండచరియలు విరిగి పడిన ఘటనలో 146కు చేరిన మృతుల సంఖ్య
ఇథియోపియా: దక్షిణ ఇథియోపియాలోని మారుమూల ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మరణించినవారి సంఖ్య 146కు చేరింది. దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో మరణించినవారిలో... చిన్నారులు, గర్భిణీలు ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. సోమవారం జరిగిన ఈ దుర్ఘటనలో 55మంది మరణించగా మంగళవారం నాటికి మృతుల సంఖ్య 146కి పెరిగిందని అక్కడి అధికారులు మీడియాకు వెల్లడించారు.
మట్టిదిబ్బల్లో కూరుకుపోయిన బాధితులను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది చర్యలు వేగవంతం చేశారని, బురదలో చిక్కుకుపోయిన ఐదుగురిని ప్రాణాలతో రెస్క్యూటీమ్ రక్షించగలిగారని ఆయన తెలిపారు. సంఘటన ప్రాంతంలో ప్రమాదంలో తన తల్లిదండ్రులతోపాటు మొత్తం కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారులు డెడ్‌బాడీలను కౌగిలించుకుని విలపిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఇథియోపియాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం సర్వ సాధారణం.
జులైలో ప్రారంభమయ్యే వర్షాలు సెప్టెంబర్ మధ్య వరకు కురుస్తాయని ఈ కాలంలో కొండచరియలు విరిగిపడి సమీప ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నట్లు స్థానికులు తెలిపారు.