148 కోట్లు సేకరించిన స్టాన్‌ప్లస్‌

148 కోట్లు సేకరించిన స్టాన్‌ప్లస్‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: అంబులెన్స్ సర్వీస్‌‌‌‌లను అందించే కంపెనీ స్టాన్‌‌‌‌ప్లస్ ఇండియా సిరీస్‌‌‌‌ ఏ రౌండ్‌‌‌‌లో 20 మిలియన్ డాలర్ల (రూ. 148 కోట్ల) ను సేకరించింది.  ఈ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ రౌండ్‌‌‌‌లో హెల్త్‌‌‌‌క్వాడ్‌‌‌‌, కలారి క్యాపిటల్‌‌‌‌, హెల్త్‌‌‌‌ఎక్స్ క్యాపిటల్‌‌‌‌ సింగపూర్ వంటి కంపెనీలు  పాల్గొన్నాయి. అంబులెన్స్‌‌‌‌లను లీజుకు తీసుకోవడానికి మరో 2 మిలియన్ డాలర్లను  గ్రిప్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌ నుంచి స్టాన్‌‌‌‌ప్లస్ సేకరించింది. తాజాగా సేకరించిన ఫండ్స్‌‌‌‌తో మొత్తం 500 హాస్పిటల్స్‌‌‌‌కు తమ సర్వీస్‌‌‌‌లను అందించడానికి వీలుంటుందని, రెడ్ అంబులెన్స్ బ్రాండ్‌‌‌‌ను 5 సిటీల నుంచి 15 సిటీలకు విస్తరించడానికి అవకాశముంటుందని స్టాన్‌‌‌‌ప్లస్ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. పశ్చిమ దేశాల్లోని 911 సర్వీస్‌ల మాదిరే దేశంలో వేగవంతమైన అత్యవసర సర్వీస్‌లను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం తమ అంబులెన్స్‌‌‌‌లు  15 నిమిషాల్లో  అవసరమున్న ప్రదేశానికి చేరుకుంటున్నాయని, ఈ టైమ్‌‌‌‌ను 8 నిమిషాలకు తగ్గించాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నామని వివరించింది. ఎమెర్జెన్సీ రెస్పాన్స్‌‌‌‌ ఇండస్ట్రీ వాల్యూ 15 బిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొంది. దేశంలో గ్రోసరీలను డెలివరీ చేయడానికి 10 నిమిషాలే పడుతోందని, అదే అంబులెన్స్‌‌‌‌లు రావడానికి 45 నిమిషాలు పడుతోందని స్టాన్‌‌‌‌ప్లస్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ ప్రదీప్‌‌‌‌ సింగ్ అన్నారు.