Union Budget 2024-2025 : ఉన్నత విద్యకు 10 లక్షల రుణం

Union Budget 2024-2025 : ఉన్నత విద్యకు 10 లక్షల రుణం
  • ఎడ్యుకేషన్ సెక్టార్​కు రూ.1.48 లక్షల కోట్లు
  • మోడల్ స్కిల్ లోన్ కింద రూ.7.5 లక్షల వరకు రుణం

న్యూఢిల్లీ : విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం బడ్జెట్​లో రూ.1.48 లక్షల కోట్లు కేటాయించారు. మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద విద్యార్థులకు రూ.7.5 లక్షల వరకు రుణం అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మోడల్ స్కిల్లింగ్ లోన్ స్కీమ్​ను సవరించనున్నది. ఈ స్కీమ్​ కింద ఏటా 25వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, ప్రభుత్వ పథకాలు, విధానాల ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందని యువత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలను ప్రకటించింది.

దేశీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణ మొత్తంపై మూడు శాతం వడ్డీ రాయితీ ఇచ్చే ఈ వోచర్లను అందజేస్తామని ప్రకటించారు. కాగా, ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్​మెంట్ కు ఈసారి నిధుల కేటాయింపులు తగ్గాయి. స్కూల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ గతేడాదితో పోలిస్తే రూ.535 కోట్లు పెంచారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం గత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా కంటే ఈసారి గ్రాంట్​ను రూ.9,600 కోట్లకు పైగా తగ్గింది. అదేవిధంగా, ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలకు) గతేడాదితో పోలిస్తే భారీగా నిధులు తగ్గాయి. రూ.10,384.21 కోట్ల నుంచి రూ.10,324.50 కోట్లకు తగ్గించారు.

సెంట్రల్ యూనివర్సిటీలకు నిధులు కేటాయింపులు గతేడాదితో పోలిస్తే భారీగా పెంచారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ వర్సిటీలకు రూ.12వేల కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ.15,472 కోట్లు కేటాయించారు. సుమారు 28శాతం నిధుల కేటాయింపు పెరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఎన్​సీఈఆర్టీ, పీఎం శ్రీ స్కూల్స్​తో పాటు స్టేట్ గవర్నమెంట్, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి నడిపించే స్కూల్స్​కు నిధుల కేటాయింపులు పెరిగాయి. ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూషన్స్​లో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కేటాయింపులు రూ.161 కోట్లకు పెంచారు. వరల్డ్​ క్లాస్ ఇన్​స్టిట్యూషన్స్​కు కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.1,300 కోట్ల  నుంచి రూ.1,800 కోట్లకు పెంచారు.