- 27 వరకు మూడు రోజులు నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ‘14వ నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో–2024’ నిర్వహించనున్నారు. ఈ షోలో రెసిడెన్షియల్, ఆఫీస్, రిటైల్ కమర్షియల్ ప్రాపర్టీలను ప్రదర్శించనున్నారు. నరెడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్) తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ప్రాపర్టీ షోలో డెవలపర్స్, బిల్డర్స్, ప్రమోటర్లు పాల్గొంటున్నారని.. అనేక రకాల ప్రాపర్టీలు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అమ్మకందారులు, కొనుగోలుదారులకు ఇది చక్కటి అవకాశమని నిర్వాహకులు తెలిపారు.
ఫైనాన్షియల్ సంస్థల ప్రతినిధులతో సహా మొత్తం వందకుపైగా పార్టిసిపెంట్లు ఉంటారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో మార్పునకు నరెడ్కో తెలంగాణ నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నామని ఆ సంస్థ ప్రెసిడెంట్ విజయ సాయి తెలిపారు. దేశంలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ముందంజలో ఉందన్నారు. ఈ షోలో అన్ని వర్గాలకు అనుకూలమైన అపార్ట్ మెంట్లు, విల్లాలు, ప్లాట్లు డిస్ ప్లే చేస్తున్నట్టు నరెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.