ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు15 రోజుల ఆడ శిశువును ఊయలలో వదిలివెళ్లారు. ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాంబాబు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, జిల్లా బాలల సంరక్షణ అధికారిణి విష్ణువందన
డీసీపీవో చైల్డ్ కేర్ సిబ్బంది యశోద, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంధ్య, ఐపీడీఎస్ సూపర్వైజర్సుధ భవాని పాపను పరిశీలించారు. పాప వివరాల కోసం ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాపను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు శిశు గృహంలో ఉంచామని అధికారులు తెలిపారు.