సైబర్ ​టవర్స్ రూట్లలో 15 రోజులు ట్రాఫిక్​ ఆంక్షలు

సైబర్ ​టవర్స్ రూట్లలో 15 రోజులు ట్రాఫిక్​ ఆంక్షలు

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లో పెరిగిపోతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సర్వీస్​రోడ్లను డెవలప్​చేస్తున్నారు. త్వరలో సైబర్​టవర్స్ ఫ్లైఓవర్​ల్యాండింగ్ పాయింట్ నుంచి జేఎన్​టీయూ రూట్​లో యశోదా హాస్పిటల్ వరకు సర్వీస్​రోడ్డును నిర్మించనున్నారు. ఈ పనుల కారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ నెల 14 నుంచి 30వరకు వెహికల్స్​డైవర్షన్ అమలులో ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్​ జాయింట్​సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

 సైబర్ టవర్స్, 100 ఫీట్​రోడ్డు, కొత్తగూడ జంక్షన్​వైపు నుంచి జేఎన్​టీయూ, మూసాపేట వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో ట్రావెల్​చేయాలని సూచించారు. జేఎన్టీయూ, మూసాపేట వైపు వెళ్లే వాహనదారులు100 ఫీట్​రోడ్డు మీదుగా పర్వత్​నగర్​జంక్షన్, కైత్లాపూర్​బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. ఐకియా, సైబర్​ గేట్​వే, సీఓడీ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ ఫ్లైఓవర్​మీదుగా జేఎన్​టీయూ వైపు వెళ్లాలి. సైబర్ టవర్స్​ ఫ్లైఓవర్ కింద నుంచి జేఎన్​టీయూ వైపు వెళ్లే వాహనదారులు ఎన్​గ్రాండ్​హోటల్​, ఎన్​ కన్వెన్షన్, జైన్ ఎంక్లేవ్, యశోదా హాస్పిటల్​బ్యాక్​ సైడ్​ రోడ్డు, ఆర్​ఓబీ ఫ్లైఓవర్​మీదుగా జేఎన్​టీయూ  వైపు వెళ్లాలి.