తెలంగాణలో 15 మంది DSP లకు ప్రమోషన్

తెలంగాణలో 15 మంది DSP లకు ప్రమోషన్

తెలంగాణ హోంశాఖలో భారీగా ప్రమోషన్లు జరుగుతున్నాయి. తాజాగా 15 మంది డీఎస్పీలను (DSP) అడిషనల్ ఎస్పీలుగా (ASP) ప్రమోట్ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోషన్ చేసేందుకు ప్రభత్వం అంగీకరించడంతో మంగళవారం (మార్చి 18) సర్క్యులర్ జారీ చేశారు హోం శాఖ స్పెషల్ సెక్రటరీ రవిగుప్తా. ప్రమోషన్ పొందిన డీఎస్పీలు 15 రోజుల్లో డీజీపీకి రిపోర్ట్ చేయవలసిందిగా పేర్కొన్నారు. ప్రమోషన్లు పొందిన వారందరూ డీజీపీ తెలంగాణకు రిపోర్ట్ చేయనున్నారు.

ASPలుగా ప్రమోషన్ పొందిన వారి లిస్టు:

  1. టీఎమ్ఎన్ బాజ్జీ (ఏసీపీ,  షీ టీమ్స్, రాచకొండ),

  2. కె.శ్రీకాంత్ (డీఎస్పీ, V&E)

  3. ఎస్.శ్రీనివాస్ రావు (ఏసీపీ, ఎస్బీ సెక్యూరిటీ,  నిజామాబాద్)

  4. సి.కుశల్కర్ (ఏసీపీ, ట్రాఫిక్, మహేశ్వరం రాచకొండ),

  5. జి.నరేందర్ (ఏసీపీ, టాస్క్ ఫోర్స్, కరీంనగర్),

  6. పి.వెంకటరమణ (ఏసీపీ, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్)

  7. ఎస్.చంద్రకాంత్ ( ఏసీపీ, సీసీఎస్, సైబరాబాద్)

  8. వి.రఘు (ఏసీపీ, కాచిగూడ, హైదరాబాద్)

  9. కె.పూర్ణచందర్ (ఏసీపీ, హైదరాబాద్ సెక్రటేరియట్)

  10. జి.హన్మంతరావు (ఏసీపీ, బాల్ నగర్, సైబరాబాద్)

  11. కె.శ్రీనివాసరావు (ఏసీపీ, శంషాబాద్ సైబరాబాద్)

  12. జి.రమేష్ (డీఎస్పీ, ఎస్బీ, నల్గొండ)

  13. యం.సుదర్శన్ (డీఎస్పీ, జీహెచ్ఎంసీ)

  14. ఎన్.ఉదయ్ రెడ్డి (డీఎస్పీ, ఏసీబీ)

  15. ఎన్.శ్యాం ప్రసాద్ రావు (డీఎస్పీ,  సీఐడీ)