![వైజాగ్ లో 15 అడుగుల కింగ్ కోబ్రా కలకలం](https://static.v6velugu.com/uploads/2020/05/kingcobra.jpg)
వైజాగ్ లో 15 అడుగుల కింగ్ కోబ్రా స్థానికులను భయపెట్టింది. తమ్మడపల్లి గ్రామంలో …భారీ నల్ల త్రాచు కనిపించడంతో.. స్థానికులు భయపడ్డారు. విశాఖ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వైల్డ్ లైఫ్ NGO సిబ్బందితో కలిసి నల్లత్రాచును రెస్క్యూ చేశారు అటవీ శాఖ అధికారులు. కింగ్ కోబ్రాను… చెరుకుపల్లి రిజర్వుడ్ ఫారెస్ట్ లో వదిలిపెట్టారు.
ఇలాంటి భారీ నల్లత్రాచు పాములను చాలా తక్కువ గా చూస్తుంటామని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో.. వైజాగ్ ఫారెస్ట్ రీజియన్ లో …12 నల్ల త్రాచులను గుర్తించామన్నారు. 15 అడుగుల పొడవైన భారీ కింగ్ కోబ్రాలు అరుదుగా కనిపిస్తాయన్నారు . ఈ కింగ్ కోబ్రా కాటేస్తే చనిపోతారనీ.. దీనికి మందులేదని అన్నారు. మిగతా పాములను కింగ్ కోబ్రా చంపేస్తుందని చెప్పారు. ఇలాంటి పాములను బంధించడానికి గ్రామాల్లోని జనాలకు ట్రెయినింగ్ ఇస్తున్నామని చెప్పారు వైజాగ్ ఫారెస్ట్ అధికారులు.