అనకాపల్లిలో 15 అడుగులు శ్వేత నాగుపాము : బుసలు కొడుతూ జనంపైకి

అనకాపల్లిలో 15 అడుగులు శ్వేత నాగుపాము : బుసలు కొడుతూ జనంపైకి

పాము పిల్ల కనిపిస్తేనే పరుగులు తీస్తాం.. అలాంటిది అనకొండ అంత పొడువు ఉన్న తెల్లటి నాగు పాము కనిపిస్తే.. పడగ ఎత్తి బుసలు కొడుతుంటే.. ఇంకేమైనా ఉందా.. అలాంటి నాగు పాము ఏపీ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి పొలాల్లో కనిపించింది. పనుల కోసం పొలం వెళ్లిన కూలీలు ఆ పామును చూసి వణికిపోయారు..

పొలంలో కనిపించిన ఆ శ్వేత వర్ణంలోని 15 అడుగులు నాగు పామును చూసి కుక్కలు అరవటంతో పడగ విప్పి బుసలు కొట్టింది. ఆ సమీపంలోనే కూలీల వైపు అత్యంత వేగంగా వెళ్లింది. వాళ్లు పెద్దగా అరుస్తూ పరుగులు తీశారు. దీంతో ఆ 15 అడుగులు నాగుపాము బుసలు కొడుతూ అక్కడి నుంచి పొలాల్లోకి వేగంగా వెళ్లిపోయింది. 

ఈ నాగు పాము అక్కడి నుంచి వెళ్లిపోయినా.. పొలంలో పని చేయటానికి కూలీలు భయపడిపోయారు. పనులు చేయటం అంటూ వెళ్లిపోయారు. ఆ నాగు పాము పడగ విప్పటం.. బుసలు కొట్టటం అంతా అక్కడ ఉన్న ఓ కూలీ తన సెల్ ఫోన్ లో తీశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. 

ALSO READ | చావుకు వెళ్తే.. చచ్చినంత పనయ్యింది: అంతిమయాత్రలో తేనెటీగల దాడి.. శవాన్ని రోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు..

ఇలాంటి పాములు అరుదుగా కనిపిస్తాయని.. వీటిని గిరినాగు అని అంటారని స్థానికులు చెబుతున్నారు. అంత పెద్ద గిరినాగును చూడటం ఇదేఅని.. ఇప్పటి వరకు వినటమే కానీ చూడటం ఫస్ట్ టైం అంటున్నారు కూలీలు. ఆ పామును చూసిన తర్వాత పొలంలోకి వెళ్లాలంటేనే భయమేస్తుంది అంటూ కూలీలు చెప్పుకొచ్చారు.