కలుషిత నీరు తాగి 15 మేకలు మృతి

  •     బ్రిక్స్ ఇండస్ట్రీ ముందు బాధితుల ఆందోళన

జైపూర్, వెలుగు: కలుషితమైన నీరు తాగి 15 మేకలు మృత్యువాత పడిన ఘటన జైపూర్​మండలం కాసీంపల్లి గ్రామ శివారులో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. మేత కోసం వెళ్లిన మేకలు సాయంత్రం తిరిగి వస్తూ డ్రైనేజీలో కలుషిమైన నీటిని తాగి 15 మేకలు ఘటనా స్థలంలోనే చనిపోయాయి. మరి కొన్ని మేకలు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన యూసూఫ్ అనే వ్యక్తి సిమెంట్​ఇటుకల్లో వాడే కెమికల్స్​ను డ్రైనేజీల్లో వదలడంతో ఆ నీటిని తాగి మేకలు మృత్యువాత పడినట్లు బాధితులు తెలిపారు. రూ.2 లక్షల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిక్స్ కంపనీ ముందు బైఠాయించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​చేశారు. విషయం తెలుసుకున్న జైపూర్ ఎస్ఐ ఉపేందర్ ఘటనా స్థలానికి చేరుకుని ఇటుకల బట్టీ నిర్వహకుడిని పోలీస్ స్టేషన్​కు తరలించారు.