తెలంగాణ హైకోర్టులో15 జడ్జిల పోస్టులు ఖాళీ : మంత్రి అర్జునరామ్‌‌ మేఘ్వాల్‌‌

తెలంగాణ హైకోర్టులో15 జడ్జిల పోస్టులు ఖాళీ : మంత్రి అర్జునరామ్‌‌ మేఘ్వాల్‌‌
  • లోక్‌‌సభలో మంత్రి మేఘ్వాల్‌‌ సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టులో 15 న్యాయమూర్తుల స్థానాలు ఖాళీలు ఉన్నాయని కేంద్ర న్యాయ సహాయ మంత్రి అర్జునరామ్‌‌ మేఘ్వాల్‌‌ వెల్లడించారు. రాష్ట్ర హైకోర్టులో 42 జడ్జి పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 27 మంది విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు.

జిల్లా, సబార్డినేట్‌‌ కోర్టుల్లో 560 న్యాయమూర్తులకు గాను 445 మంది ఉన్నారని, 115 ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు. గురువారం రాజ్యసభలో ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ నిరంజన్‌‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.