ఆఫ్ఘ‌నిస్తాన్‌ లో రెండు హెలికాప్టర్లు ఢీ కొని 15 మంది మృతి

ఆఫ్ఘ‌నిస్తాన్‌ లో రెండు హెలికాప్టర్లు  ఢీ కొని 15 మంది మృతి

ఆఫ్ఘ‌నిస్తాన్‌ హెల్మండ్ ప్రావిన్సులోని న‌వా జిల్లాలో రెండు ఆర్మీ హెలికాప్ట‌ర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. క‌మాండోల‌ను వ‌దిలిన త‌ర్వాత గాయ‌ప‌డ్డ జ‌వాన్లను త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో ఈ హెలికాప్ట‌ర్లు ఢీకొన్న‌ట్లు అధికార వ‌ర్గాల ద్వారా  తెలిసింది. ఈ ప్ర‌మాదంలో 8 మంది మాత్ర‌మే మ‌ర‌ణించిన‌ట్లు మ‌రో వ‌ర్గం ద్వారా తెలిసింది. అయితే ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఇప్ప‌టి వ‌ర‌కు ఆఫ్ఘ‌న్ ర‌క్ష‌ణ శాఖ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. మంగ‌ళ‌వారం రాత్రి ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.