కైరో: సెంట్రల్ యెమెన్‌లోని గ్యాస్ స్టేషన్లో శనివారం పేలుడు సంభవించడంతో15 మంది మరణించారు. ఈమేరకు ఆదివారం హౌతీ తిరుగుబాటుదారుల ఆధ్వర్యంలోని హెల్త్ ఆఫీసర్లు ఓ ప్రకటనలో తెలిపారు. బైదా ప్రావిన్స్‌లోని జహెర్ జిల్లాలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా, 67 మంది గాయపడ్డారు.
వీరిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన వారి ఆచూకీని కనుగొనేందుకు రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టాయి. పేలుడుకు స్పష్టమైన కారణమేంటో తెలియడం లేదు. ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు బైదాను నియంత్రిస్తున్నారు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న యెమెన్ ప్రభుత్వంతో వీరు ఒక దశాబ్దానికి పైగా యుద్ధం చేస్తున్నారు.