పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం ట్రాఫిక్ విభాగం కల్పించిన ఆఫర్‌కు వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బైక్‌లు, ఆటోలకు 75శాతం రాయితీ; కారు, లారీ, హెవీ వెహికల్స్‌కు 50 శాతం రాయితీతో పాటు నో మాస్క్ చలాన్లపై 90శాతం రాయితీ కల్పించారు. ఈ ఆఫర్ మార్చి 1 నుంచి 31 వరకు అందుబాటులో ఉండనుంది. దీంతో వాహనదారులు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేస్తున్నారు. చెల్లింపుల కోసం గంటల తరబడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వర్ సామర్థ్యాన్ని కూడా పెంచామని అధికారులు తెలిపారు. దీంతో గురువారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 15లక్షలకు పైగా చలాన్లు క్లియర్ అవ్వగా గవర్నమెంట్‌కు 15 కోట్ల ఆదాయం చేకూరింది. మొత్తంగా మొదటి మూడు రోజుల్లోనే ప్రభుత్వానికి రూ. 39 కోట్లు వసూలు కావడం గమనార్హం. ప్రతీ నిమిషానికి 700 మంది చలాన్లు చెల్లిస్తున్నారని పోలీసులు చెప్పారు. వాహనదారుల నుంచి స్పందన భారీగా ఉండటంతో.. సర్వర్ సామర్థ్యం కూడా పెంచినట్లు తెలిపారు.
For More News..